22 April, 2026 | 1:42 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

నడిమిట్ల కలిసేర ప్రేమల సుకుమారి..

10-03-2026 12:00 AM

‘బేబి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తమ ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ జోడీ కలిసి మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ చిత్రమే ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’. ‘90స్’ వెబ్‌సిరీస్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.

మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి తొలిగీతంగా ‘సంచారమే’ను చేశారు. ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను సైతం హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరేటి వెంకన్న కలిసి ఆలపించారు. ‘సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందమేమున్నది..

ఊరునిడిసి గాలిమోటారెక్కినాది.. మోటు మనుషులనిడిసి.. స్వీటు మనుషులజేరి.. మనసు నమ్ముకుంది.. వెంకటేశ్వర సామి.. నడిమిట్ల కలిసేర ప్రేమల సుకుమారి’.. అంటూ సాగుతోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ప్రతిబింబిస్తోందీ గీతం.  ఈ చిత్రానికి డీవోపీ: అజీమ్ మహమ్మద్; కూర్పు: నవీన్ నూలి.