22 April, 2026 | 1:49 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

సల్మాన్ సరసన!

10-03-2026 12:00 AM

బాలీవుడ్ ‘భాయ్ జాన్’ సల్మాన్‌ఖాన్ హీరోగా టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ కాంబోపై చాలా రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఇప్పటికే వంశీ తాజా సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. హీరోయిన్ ఎంపిక కూడా దాదాపు పూర్తయిందని టాక్.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో దక్షిణాదిన అగ్ర కథానాయిక నయనతార హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం. ‘జవాన్’తో నయన్‌కు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. పైగా సీనియర్ హీరోల సరసన నయనతార పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సల్మాన్‌ఖాన్‌కున్న మాస్ ఇమేజ్‌కు నయన్ తోడైతే బ్లాక్‌బస్టర్ కాంబో సెట్ అయినట్టే! అంతేకాక నయన్ ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది.

ఇటీవల ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నటించి, హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘ఎన్‌బీకే 111’లో కథానాయికగా నటిస్తోంది. అటు తమిళంలోనూ నయన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇక నయన్ నటించిన తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందు కు రానుంది.