దేశానికే ఆదర్శంగా అక్రిడిటేషన్ల జారీ
- అక్రిడిటేషన్ల సంఖ్య తేలితే మరిన్ని సౌకర్యాలు
- గతం కంటే ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో మంజూరు
- మే10లోగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇస్తాం
- నేడు అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ల పంపిణీకి కలెక్లర్లకు ఆదేశం
- మే ౩1 వరకు అందరికీ బస్సు పాస్‌ల పొడిగింపు
- మంత్రి పొంగులేటిశ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కూ అక్రిడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సమాచార, పౌరసంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ప ష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు పాత్రికేయులకు ఆరోగ్యంతోపాటు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. గురువారం సమాచార శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంత్రి అందజేశారు.
ఈ సందరభంగా మంత్రి మాట్లాడు తూ.. దేశంలో, ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇక్కడ అనుసరించాలన్న ఆలోచనమేరకు పరిశీలన సాగిం దని అందువల్లే ఈ కార్డులజారీలో ఆలస్యం చోటుచేసుకుందన్నారు. గత ప్రభుత్వం 32,500 మందికి అక్రిడిటేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా 23,352కే పరిమితం చేసింద న్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు సుమారు 46 వేల మందికి పైగా అక్రిడిటేషన్లు ఇచ్చేలా మార్పులుచేసిందని తెలిపారు.
ఇప్పటికే సుమారు 2,800 వరకు కార్డులను ఆమోదించడం జరిగిందని వివరించారు. జర్నలి స్టుల సూచనల మేరకు జీవోలలో మార్పు లు చేర్పులు చేశామని, అర్హులై న జర్నలిస్టులకు కార్డుల మంజూరులో వెనకడుగు ప్రస క్తే లేదన్నారు. మే 1న అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ చేయాలంటూ కలెక్ట ర్లకు ఆదేశాలు జారీచేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ప్రక్రియలో మే 10 వతేదీని కటాఫ్ డేట్‌గా పెట్టుకొని దరఖాస్తులు చేసుకోవాలని, ఆ తేదీలోగా వచ్చే దరఖాస్తులను ఆమోదిస్తామని మంత్రి తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని త్వరలో పాత్రికేయ సంఘాలతో భేటీ అవుతామని తెలిపారు. ఏప్రిల్ 30తో కొంతమంది జర్నలిస్టుల బస్సుపాస్‌ల గడువు ముగుస్తున్నం దున మరోనెల పాటు పొడిగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను అందజేసి అభినందిం చారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సమాచారశాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డి పాల్గొన్నారు.






