కార్మికులకు మే డే శుభాకాంక్షలు
01-05-2026 01:36 AM
మజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కార్మికులకు మే డే శుభాకా ంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. సింగరేణి, ఆర్ టీ సీ, భవన నిర్మాణ రంగం సహా పలు రంగాలకు చెం దిన కార్మికులు, ఆటో డ్రైవర్లు, దినసరి కూ లీలు, అసంఘటిత రంగ కార్మికుల కోసం గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కేసీఆర్ గుర్తు చేశారు.






