ప్రధాని సభ విజయవంతం చేయాలి
మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి: అమరం మోహన్ రెడ్డి
మేడ్చల్ అర్బన్, మే 9 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ప్రధాని బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ అధికారం చేపట్టిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపునకు ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రచా రం చేయాలని ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి రానున్న ప్రతి ఎన్నికల్లో భారతీయ జన తా పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.






