రాష్ట్రంలో శాంతిభ ద్రతలు క్షీణించాయి
- ప్రతిపక్షాలపై వేధింపులు తప్ప ప్రభుత్వం దృష్టి సారిండం లేదు
- మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి) : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, చక్కదిద్దాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. శాంతిభద్రతలు గాడి తప్పుతున్నా సీఎం రేవంత్ రెడ్డి హోంశాఖపై సమీక్ష చేయడం లేదన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న ప్పుడు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందు ఉం దని, శాంతిభద్రతలు పటిష్టంగా ఉండేవని గుర్తు చేశారు. ప్రస్తుతం పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని, మాజీ ఐపీఎస్ భార్యను హత్య ఉదంతం అందుకు నిదర్శనమన్నారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ అర్ధరాత్రి గస్తీకి వెళ్తే పోకిరీలు ఎలా వేధించారో అందరికీ తెలుసన్నారు. కరీంనగర్‌లో పట్ట పగలు బంగారం షాప్‌లో చోరీ జరిగిందని, నివేదికలు తెప్పించుకునే తీరిక సీఎంకు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో క్రైం రేట్ పెరిగిందని, 2023 కంటే 2024 లో 34 వేల కేసులు అధికంగా నమోదైనట్లు నేషనల్ క్రైం రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. మ హిళలు, చిన్నారులపై దాడుల్లో తెలంగాణ దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు ఉత్తిగా నమోదు కాదని, దీని వెనుక ఏం జరిగిందనే దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల వెళ్తుంటే నాపైన పోలీసులు నిఘా పెట్టడం దారుణమన్నారు. ఎమ్మెల్సీ సురభి వాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు.






