ఫూలే ఆశయం కోసం ప్రధాని పాటుపడాలి
బీసీ మహిళ సబ్ కోటపై అన్ని పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి
ఈనెల 16న ఢిల్లీలో బీసీ మహిళల ధర్నా
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): బీసీల ఐకాన్ మహాత్మ జ్యోతిబా పూలే 200 జయంతి సందర్భంగా మొదటిసారిగా పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించడం అభినందనీయమని, పూలే ఆశయాలు అమలు చేయడానికి ప్రధాని పాటుపడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈనెల 16 17 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు ఆమోదం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు కంటే ముందు జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.
దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీలు మహిళా బిల్లు లక్ష్యం నెరవేరాలంటే బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని ఈ విషయాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా మహిళా బిల్లుపై గోడ మీది పిల్లి వాటంగా వ్యవహరించకుండా బీసీ కోటపై తమ రాజకీయ విధానాన్ని ప్రకటించి ఈ నెల 16న జరిగే పార్లమెంటు సమావేశాల్లో బీసీ మహిళల సబ్ కోట కోసం పట్టుబట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లులో బీసీ మహిళ కల్పించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అందులో భాగంగానే సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపడతామని, అదేవిధంగా ఈనెల 16న ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.




