8 May, 2026 | 3:56 AM

మోదీకి అఖండ స్వాగతానికి ప్రజలు సిద్ధం

08-05-2026 12:00 AM
  1. బండి సంజయ్‌పై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
  2. బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

హైదరాబాద్, మే 7(విజయక్రాంతి): తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలికేందుకు ప్రజలు తరలివచ్చేందుకు సిద్దంగా ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీ సభకు ఆటంకం కలిగించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజ య్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డ్రగ్స్ పరీక్షకు సిద్ధమని కేటీఆర్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన సవాల్‌కు ఇప్పటివరకు స్పందన లేదన్నారు. శాంతిభద్రత అనేది రాష్ట్రఆధీనంలో ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపా రు.

భౌతిక దాడులకు బీజేపీ వ్యతిరేకమని, తమ పార్టీ నేతలపై ఏది పడితే అది మాట్లాడితే.. బీజేపీ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. మీరు ఇలాగే ఉంటే..బీజేపీ కార్యకర్తలు ఏమి చేయాలో అది చేస్తారని, కేసీఆర్ ప్రజాసమస్యల కోసం కాకుండా, ప్రతిపక్ష హోదా కోసం తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు.