సోయా గయా.. మొలకెత్తని విత్తనం
ఆందోళన చెందుతున్న రైతులు..
బోథ్,(విజయక్రాంతి): ప్రకృతిని ఎదిరించి వంటలు సాగు చేసేందుకు సిద్ధమైన రైతాంగానికి విత్తన కంపెనీలు చీడ పురుగుల్లా దాపురించాయి. దీంతో సోయా పంటను సాగు చేస్తున్న రైతాంగానికి తీరని నష్టం సంభవించిందని వాపోతున్నారు.
50 ఎకరాల్లో మొలకెత్తలేదు...
మండలంలోని మరల పెళ్లి గ్రామంలో సోయాబీన్ పంట వేసిన దాదాపు 30 మంది రైతులకు చెందిన సోయా పంట మొలకెత్తలేదు మంగళవారం గ్రామానికి చెందిన రైతులు సంబంధిత వ్యవసాయ అధికారికి తాము వేసిన సోయా పంట మొలకెత్తలేదని ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు జరిగిన నష్టం పై ఉన్నతాధికారుల వివరిస్తామని విత్తన కంపెనీ వారిని పిలిపించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. అయితే రైతులు మాత్రం అసలే వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే మొలకెత్తని విత్తనాల వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పంట కాలం వెనుకబడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు...
తేజస్వి విత్తనం కొంపముంచింది సాయినాథ్ రైతు
మండలంలోని కోరమండల్ దుకాణంతోపాటు స్థానికంగా ఉన్న పలువురు వ్యాపారుల వద్ద తేజస్వి కంపెనీ చెందిన సోయా విత్తనాలను కొనుగోలు చేశామని అయితే ఎంతో ఆశగా పోసిన విత్తనం మొలకెత్తకపోవడంతో వేల రూపాయల్లో నష్టం సంభవించిందని మరల పెళ్లి గ్రామానికి చెందిన రైతు లాడే వారి సాయినాథ్ వాపోయారు. పంట నస పోయామని వ్యవసాయ శాఖ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే రెండు మూడు రోజులు ఆగండి కంపెనీ వారు వస్తారని చల్లగా చావు కబురు చెబుతున్నారు తాము సమయం లేక సతమతమవుతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. కాగా మొక్కజొన్న విత్తనాలు సైతం మొలకెత్తలేదని రైతులు వాపోతున్నారు. రైతన్నను ఖరీఫ్ కష్టాలు ఆదిలోనే అలుముకున్నాయి అధికార యంత్రాంగం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది






