3.5 లక్షల లంచం
భద్రాచలంలో ఏసీబీకి చిక్కిన అటవీ అధికారులు
భద్రాచలం, మే 7 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అటవీశాఖ అధికారులు రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. చర్ల మండలం పూసుగుప్ప ప్రాం తంలో రోడ్డు నిర్మాణంలో అడ్డంగా ఉన్న చెట్లను కాంట్రాక్టర్ నరికేశాడు. చెట్లు నరికినందుకు కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం అటవీశాఖ ఎఫ్‌డీవో సుజాత కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాగా, వారి సూచనమేరకు గురువా రం రూ.3.50 లక్షలు సదరు అధికారికి ఇస్తుండగా, ఏసీబీ డీఎస్పీ రమేశ్ ఆధ్వర్యంలో ఎఫ్‌డీవో తోపాటు చర్ల ఇంచార్జ్ డీఆర్వో కృష్ణయ్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇటీవలే కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి సైతం రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం విధితమే.






