30 June, 2026 | 7:27 PM

చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే

30-06-2026 06:22 PM

విద్యుత్తు సమస్యలు పరిష్కరించండి మహాప్రబో

తాండూరు,(విజయక్రాంతి): చిన్న గాలి వాన వస్తే చాలు గిరిజన గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తీవ్రమవుతున్నాయని వెంటనే సంబంధిత అధికారులు  స్పందించి విద్యుత్ నిరంతర సరఫరా అయ్యేలా చూడాలని మంగళవారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించారు. ఓమ్లా నాయక్ తండ, జయరాం తండా, ఊరేంటి తాండ గ్రామాలకు చెందిన గిరిజనులు మాట్లాడుతూ... తరచూ  విద్యుత్ పోతల వల్ల దోమల బెడద అధికమై కలువురు వృద్ధులు చిన్నారులు రోగాల పారిన పడుతున్నారని తాగునీటి సౌకర్యానికి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.