30 June, 2026 | 7:26 PM

సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం

30-06-2026 06:25 PM

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మునిసిపల్ ను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపల్ సాధారణ సమావేశము జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయ రమణారావు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూస్తూ, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో 18 అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు.

పట్టణంలో ప్రస్తుత వర్షాకాలం దృశ్య ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించుటకు అధికారులు, కౌన్సిల్ సభ్యులు వార్డులను సందర్శించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని విజయ రమణారావు అన్నారు. పట్టణంలో వివిధ వార్డుల్లో కరెంటు స్తంభాలు ఏర్పాటు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు, అలాగే పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు త్వరగా పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఏఈ నీ ఆదేశించారు. పట్టణంలో అమృత నిధుల ద్వారా నూతనంగా నిర్మాణం అవుతున్న వాటర్ ట్యాంకు ను  పూర్తి చేయాలన్నారు.  మున్సిపల్ అభివృద్ధికి  సంబందించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ రమేష్, పట్టణ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.