30 June, 2026 | 7:25 PM

కాంగ్రెస్ పార్టీకి కోటయ్య చేసిన సేవలు ఎనలేనివి

30-06-2026 06:05 PM

కోటయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

గరిడేపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి కీత కోటయ్య చేసిన సేవలు మరువలేనివని, ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కీత సోమయ్య అన్నారు. మంగళవారం మండలంలోని కీతవారిగూడెంలో అనారోగ్యంతో మృతి చెందిన కోటయ్య భౌతికగాయానికి ఆ పార్టీ నాయకులు పిఏసిఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్ మియాతో కలిసి పూలమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా నివాళులు అర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కోటయ్య ఎనలేని కృషి చేశారని తెలిపారు.