మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా, వినతి
బాన్సువాడ,(విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో ధర్నా నిర్వహించారు. కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు మాట్లాడుతూ... ఎన్నికల సందర్భంగా ఏజెన్సీ కార్మికులకు పదివేల రూపాయల గౌరవ వేతనం పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులకు గుడ్లు వంటగ్యాస్ సరఫరా చేయాలని సకాలంలో బిల్లులు చెల్లించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంద శంకర్, అనిల్, విజయలక్ష్మి, సుజాత, శకుంతల తదితరులు పాల్గొన్నారు.






