శారదా అశోకవర్థన్ మృతి తీరని లోటు
16-05-2026 12:00 AM
బాలచెలిమి ప్రధాన సంపాదకులు మణికొండ వేదకుమార్
ముషీరాబాద్, మే 15 (విజయక్రాంతి): తెలుగు సాహితీ రంగానికి శారదా అశోకవర్థన్ మృతి తీరని లోటని బాలచెలిమి(పిల్లల వికాస పత్రిక) ప్రధాన సంపాదకులు, ప్రచురణకర్త మణికొండ వేదకుమార్ అన్నారు. ఆమె సాహితీ లోకానికి సుపరిచితమైన వ్యక్తి అని కొనియాడారు. ఆమె మరణంపై ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వేదకుమార్ మాట్లాడుతూ ఆకాశవాణి శ్రోతలకు, దూరదర్శన్ ప్రేక్షకులకు, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాలు, పాటలు, నవలలు, కథల ద్వారా విశిష్టమైన సాహిత్య సేవ అందించారన్నారు. ఆమెఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.






