కార్యకర్తలే పార్టీకి అసలైన సైనికులు
- తీన్మార్ మల్లన్న ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్
టీఆర్పీలో పెద్ద ఎత్తున చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనగామ, ఏప్రిల్ 12(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సదానందంను పార్టీ శ్రేణులు ఘనం గా సన్మానించాయి.జిల్లా అధ్యక్షులు సదానందం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు టీఆర్పీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పల్లబోయిన అశోక్, జిల్లా అధ్యక్షులు సదానందం మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ పోరాటమే టీఆర్పీ సిద్ధాంతం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల కోసం మేము చేస్తున్న పోరా టం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది అని అన్నా రు.
అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ఇతర పార్టీలను వీడి మా వెంటే నడుస్తున్నారు అని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజు ల్లో ఈ ప్రవాహం మరింత ఉధృతమవుతుందని స్పష్టం చేశారు.జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలను వేసి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ధ్యేయమన్నారు.
కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న ‘మహా ధర్నా’ కార్యక్రమానికి జిల్లా ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యువజన విభా గం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పోలు రాజు,జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి సతీష్ ముదిరాజ్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు బబ్బులు, పట్టణ అధ్యక్షులు గడ్డం కృష్ణ జిల్లాలోని మండలాల అధ్యక్షులు, రావుల ప్రశాంత్, చిలుకాని మహేందర్, బోడ రమే ష్,శాడ నరేష్, ఎండీ అమ్జిత్ పాషా, పానుగంటి నర్సింగరావు యాకూబ్ పాషా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




