13 April, 2026 | 5:46 AM

ఇంటర్ ఫలితాల్లో రెజొనెన్స్ విజయఢంకా

13-04-2026 03:57 AM

హన్మకొండ, ఏప్రిల్ 12(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో రెజొనెన్స్ విదా సంస్థలు తమ సత్తా చాటాయి. ఇంటర్ ఫస్టియర్‌కు చెందిన పొన్నాల వరుణ్ (263810 1723) 468/470, కంపెల్లి తనుశ్రీ (2638 105044) 468/470, దొనికెన సహస్ర (2638102106) 468/470 మార్కులు సాధించి ఏకంగా స్టేట్ సెకండ్ ర్యాంక్స్ సొంతం చేసుకున్నారు.

బీపీసీ విభాగంలో గుమ్మడవెల్ల మహతి (2638104271) 438/440, బంక వైష్ణవి(2638103992) 437/440, సఫియా కౌసర్(26381 047 82) 437/440, ధరావత్ లక్ష్మీప్రసన్న (26 38104358)437/440 మార్కులు సాధించారు. ఎంపీసీ రెండవ సంవత్సరం విభాగం లో జీ సాయికీర్తన (2638204 178) 995, నారోజు హర్షల్ (2638205 366) 994, దండె వర్ష (2638202797) 994 మార్కులతోనూ, బైపీసీ విభాగంలో గండ్ర శ్రీజ (2638201532) 991,సుఫయా తబస్సుమ్ (2638206467) 989 మార్కు లు సాధించారు.

రెజోనెన్స్ విద్యా సంస్థలు జేఈఈ, నీట్ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో అత్యంత విలువైన ర్యాంకులతో పాటు రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యా ఫలితాల్లోనూ తమదే పైచేయి నిరూపించారు. ఎంపీసీ మొదటి సంవత్సరం విభా గంలో స్టేట్ రెండవ ర్యాంకు 468/470 మార్కులు ముగ్గురు విద్యార్థులు, స్టేట్ మూడవ ర్యాంక్ 467/470 పదకొండు మంది విద్యార్థులతో పాటు 465 పైన 63 మంది 460 పైన 241 మంది సాధించారు.

ఎంపీసీ, బైపీసీ రెండవ సంవత్సరం విభాగంలో స్టేట్ టాప్ ర్యాంక్స్ 991,990 మార్కులతో పాటు 980 పైన 181 మంది సాధించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన అభినంద సభలో రెజొనెన్స్ చైర్మన్ లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఎంతో క్లిష్టమైన జాతీయ స్థాయి జేఈఈ, నీట్ పోటీ పరీక్షల్లో చాలా గొప్ప ర్యాంకులు సాధిస్తూ ఐఐటీలలోను,

నీట్‌లలోనూ, మెడికల్ కాలేజీలలో నూ సీట్లు సాధిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రాబోయే జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్ పోటీ పరీక్షలు టీఎస్‌ఈఏపీసీఈటీ ఇంకా ఇతర పోటీ పరీక్షలలో అత్యంత విలువైన టాప్ ర్యాంక్స్ సాధించాలని ఆకాంక్షిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో చైర్మన్ లెక్కల రాజిరెడ్డి, డైరెక్టర్స్ లెక్కల మహేందర్‌రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, సీఏఓ లెక్కల రమ్యారాజిరెడ్డి, అకాడమిక్ డీన్ బీఎన్ గోపాలరావు, అన్ని బ్రాంచిల ప్రిన్సిపాల్స్, విద్యార్థుల తల్లిదండ్రు లు పాల్గొని విద్యార్థులను అభినందించారు.