పార్టీని మరింత బలపరచాలి
- నాయకులందరూ కృషి చేయాలి
- రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
- భువనగిరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల సమావేశం
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 17 (విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. భువనగిరి పట్టణంలో సోమవారం ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎస్‌ఐఆర్ ఫేజ్-2 సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యక ర్తలకు ఎస్‌ఐఆర్ ఫేజ్-2 ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఎస్‌ఐఆర్ ఫేజ్ -2లో అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలన్నారు.
అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి నష్టపోకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఉత్తమ్ పద్మావతి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సా మేల్, బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






