‘పీఎంజే’ దొంగల ముఠాపై పీడీ యాక్ట్
- ఐదుగురిపై నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు
- కరీంనగర్ జిల్లా జైలు నుంచి చర్లపల్లికి నిందితుల తరలింపు
కరీంనగర్ క్రైం, ఆగస్టు 17 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెలర్స్‌లో దొంగతనం కేసులో ప్రధాన నిందితులైన ఐదుగురు ముఠా సభ్యులపై కరీంనగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మే 3న పీఎంజే జ్యువెలర్స్ షాపులోకి చొరబడిన నిందితులు సి బ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి, సుమా రు 82 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వారి లో ప్రధాన నిందితులైన రఘునాథ్ కర్మాకర్ అ లియాస్ జాగీరా సింగ్(41), రావిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమాన్(23), సూర్యమణి కుమార్ అలియాస్ సనోజ్(21), యాదవ్ అలియాస్ జైనుల్ అబ్దిన్(33), మొహమ్మద్ ఆదిల్ ఖాన్(31) పీడీ యాక్ట్ నమోదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను కరీంనగర్ జిల్లా జైలులో నిందితులకు అందజేసి, అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.






