9 May, 2026 | 10:22 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి

09-05-2026 12:00 AM

రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): మొక్క జొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. యాసంగి- 2026లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో పాటు అధిక దిగుబడులు నమోదవుతున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

శుక్రవారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్‌తో మొక్కజొన్న కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలు, వాటికి పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.  కాగా మొక్కజొన్న మార్కెట్‌కు అధికంగా వస్తున్నందున, ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమిస్తూ, వ్యవసాయశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.