పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
టీఎస్ సీపీఎస్‌ఈయు రాష్ట్ర అధ్యక్షులు గంగారపు స్థిత
హుజూర్ నగర్, జూలై 14: ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టిఎస్ సిపిఎస్‌ఈ యు రాష్ట్ర అధ్యక్షులు గంగారపు స్థిత ప్రజ్ఞ అన్నారు. జన జాగరణ యాత్ర ర్యాలీ మంగళవారం హుజూర్ నగర్ లో ప్రవేశించినందున భారీ సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గంగారపు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జీవితకాలం ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగులకు వృద్ధాప్యపు భద్రత కోసం పెన్షన్ అందించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.2004 సె ప్టెంబర్ నుంచి అమలు చేస్తున్న నూతన పె న్షన్ విధానం ఉద్యోగులకు ఏమాత్రం భద్ర త కల్పించడం లేదన్నారు.అనంతరం ఉద్యోగులు,ఉపాధ్యాయులతో కలిసి మంత్రి ఉత్త మ్ క్యాంపు కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎస్‌ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాం త్,మల్లికార్జున్, చంద్రకాంత్, ఓరుగంటి నాగేశ్వరరావు, బడుగుల సైదులు, పాలూరి అంజయ్య,మణి, కెవి సత్యనారాయణ,ప్రభాకర్ రెడ్డి, తదితరులు, పాల్గొన్నారు.






