15 July, 2026 | 12:00 AM

బీజేపీ జిల్లా అర్బన్ మీడియా కన్వీనర్‌గా సంతోష్ కుమార్

15-07-2026 12:00 AM

పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పనిచేస్తానని వెల్లడి

నాగోల్, జూలై 14 (విజయ క్రాంతి): మన్సూరాబాద్ డివిజన్కు చెందిన మొరిశెట్టి సంతోష్ కుమార్ను భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ మీడియా కన్వీనర్గా నియమించారు. ఈ సందర్భంగా తనకు బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు యశ్పాల్ గౌడ్,

బండారి భాస్కర్, కొత్త రవీందర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, నరసింహ గుప్తాకు సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ ఆదేశాల మేరకు చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.