15 July, 2026 | 12:00 AM

భాష బోధన సులభంగా ఉండాలి

15-07-2026 12:00 AM

- కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, జూలై 14, (విజయక్రాంతి): విద్యార్థులకు భాష సులభంగా అర్థమయ్యేలా బోధించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని వెంకంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇన్సర్వీస్ టీచర్ ట్రైనింగ్ను మంగళవారం ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులతో కలిసి శిక్షణలో పాల్గొని వారి అనుభవాలను తెలుసుకున్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో అమలు చేయాలని, విద్యార్థి కేంద్రీకృత బోధనతో టీఎల్‌ఎంలు వినియోగించా లని సూచించారు.

రోజువారీ జీవితంలో ఉపయోగించే పదాలు, అంకెలు, పండ్లు తదితర అంశాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో సులభంగా నేర్పాలని తెలిపారు. పిల్లలు ఆసక్తితో బడికి వచ్చేలా బోధన ఉండాలని, ఇంగ్లీష్, గణితం తదితర అంశా ల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలు పెంపొందేలా కృషి చేయాలని కోరారు.జిల్లాలో హిందీ, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులతో పాటు ప్రాథమిక స్థాయి ఎంఆర్పీలకు వివిధ కేంద్రాల్లో శిక్షణ కొనసాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో మొండ య్య, తహసీల్దార్ మహేష్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.