calender_icon.png 4 February, 2026 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కరదీపిక ఆవిష్కరణ

04-02-2026 12:15:11 AM

కలెక్టర్ హరిచందన దాసరి

సికింద్రాబాద్ ఫిబ్రవరి 3 (విజయక్రాం తి): రుణాల మంజూరులో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి బ్యాంక్ అధికారులకు సూచించా రు. మంగళవారం జిల్లా సహకార కేంద్ర బ్యాం కు ప్రధాన కార్యాలయంలో నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కరదీపికను బ్యాంకు అధికారులతో కలసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాబోవు 2026-27 సంవత్సరానికి నాబార్డ్ ద్వారా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ కరదీపికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ నాబార్డ్ ప్రతి జిల్లాకు ప్రతి సంవత్సరం పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ని సిద్ధం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ ఎల్‌డిఎం పి.ఎన్ విఎల్ ఎన్‌మూర్తి, డిడిఎం నాబార్డ్ హర్ష రఘురామ్, అఖిల్ పున్నా, సీఈవో డిసిసిబిజె భాస్కర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.