నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం
15-06-2026 05:44 PM
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం నాగారం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మహాదేవుని ఆలయాన్ని కోనరావుపేట తహసీల్దార్ వరలక్ష్మి సోమవారం కుటుంబ సమేతంగా సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు కాయతోజి బ్రహ్మచారి, నాగారం గ్రామ ఉప సర్పంచ్ కీర్తన బ్రహ్మచారి ఆధ్వర్యంలో తహసీల్దార్ వరలక్ష్మిని శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రబిందువైన శ్రీ మహాదేవుని ఆలయాన్ని తహసీల్దార్ సందర్శించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.






