శాతవాహనలో జాతీయ సేవా పథకంపై సమీక్ష
ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాల చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారుల సమీక్షలో విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ ఇనుగాల మనోహర్ మాట్లాడుతూ... ప్రోగ్రాం అధికారులు తమ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, వాలంటీర్ల సేవలను విస్తరించాలని సూచించారు.
తెలంగాణ హరిత దళం, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి బాధ్యులు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ వ్యర్ధాల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవలంబించాల్సిన నాలుగు రంగుల చెత్తబుట్టల విధానం గ్రీన్ బ్లూ రెడ్ బ్లాక్ విధానాన్ని సూచించారు. మరియు జిల్లా యువజన అధికారి తిరుపతి రెడ్డి జాతీయ సేవా పథకం యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి శ్రీరంగప్రసాద్, వివిధ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు.






