నాణ్యతలో తేడాలు వస్తే సహించేది లేదు..
- తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు
- ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన
తుంగతుర్తి జూన్ 11: జిల్లాలోని తిరుమలగిరి మండల పరిధిలో తొండ గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పురోగతి పై క్షేత్ర పరిశీలనలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన తుంగతుర్తి శాసనసభ్యులుమందుల సామేలు మాట్లాడుతూ ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల అభ్యున్నతి దృష్ట్యా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేడ్ పాఠశాలను ఏర్పాటు కోసం 200 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ పాఠశాల ఏర్పాటుతో పేద విద్యార్థులకు ఉచిత వసతి గృహంతో పాటు, కార్పొరేట్ స్థాయిలో బోధన జరుగుతుందని అన్నారు.
పేద ప్రజల పక్షపాతి ముఖ్యమంత్రి అని కొనియాడారు. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కాంట్రాక్టర్ చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు ఎల్సోజు నరేష్, సర్పంచ్ గంధ మల్ల స్వాతి, జమ్మిలాల్. , కందుకూరు లక్ష్మయ్య, సుంకర్ జనార్ధన్, సతీష్, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.






