మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధశుక్ల
బెజ్జూర్ జూన్ 18 (విజయ క్రాంతి): మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవర ణ(సర్) పై బిఎల్‌ఓ లు, బిఎల్‌ఎస్ లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
గ్రామాల్లో సర్వేకు వచ్చే బిఎల్‌ఓ లకు సంబంధిత మ్యాపింగ్ ఓటర్ల వివ రాలను అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని అన్నారు. జా బితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా రూపకల్పన చేయడంలో బిఎల్‌ఓ ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. దీనికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ తాసిల్దార్ భీమ్లా నాయక్, బిఎల్వోలు తదితరులు ఉన్నారు.






