19 June, 2026 | 1:40 AM

చెట్టు అటవీశాఖది.. గుట్ట రెవెన్యూ శాఖది

19-06-2026 12:00 AM
  1. లోసుగులను ఆసరాగా చేసుకొని మొరంను తవ్వేస్తున్నారు
  2. మామూళ్ల తో అధికారుల కళ్ళు మూయిస్తున్న మాఫియా

బోథ్, జూన్ 18 (విజయక్రాంతి) :  బోథ్ నియోజకవర్గ పరిధిలో అటవీ శాఖ, రెవె న్యూ శాఖల మధ్యన ఉన్న అటవీ భూముల లెక్క ఇప్పటికీ తేలక పోవడంతో కొంతమం ది మొరం మాఫియా కేటుగాళ్లు అందినంత మోరాన్ని తవ్వేస్తున్నారు. దీంతో నేరడిగొండ బోథ్, ఇచ్చోడ, బజార్హత్నూర్ మండలాల్లో విచ్చలవిడిగా మొరం వ్యాపారం కొనసాగుతోంది. రాత్రిపూట మొరం మాఫియా ము ఠా కాపలాదారులను పెట్టి విచ్చలవిడిగా మొరం తవ్వుకుపోతున్నారు.

నేరడిగొండ మండలంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిని అనుకుని ఉన్న కుమారి చుట్టుపక్కల ఉన్న ఎర్ర మొరం గుట్టలు మొరం మాఫి యా బంగారు బాతులా మారాయి. 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఎర్ర మొరం క్వారీని ఆనుకొని అటవీశాఖ భూమి ఉండడం ఆ భూమిలో ఏ కొంచెం తవ్విన అటవీ శాఖ వారు పట్టుకొని జరిమాణాలు విధిస్తుండటంతో అక్రమ మొరం వ్యాపారులు రెవెన్యూ భూములపై దృష్టి సారించి విచ్చలవిడిగా తరలించకపోతున్నారు.. ... 

లోకల్ మొరం తవ్వేది ఇక్కడే...

 నేరడిగొండ మండలంలోని వడూర్, రాజుల తాం డ, బుద్ధికొండ, బోథ్ మండలంలోని పిప్పలదరి, కొత్త కర త్వాడ, బోథ్, ధనుర్ (బి), రఘునాథ పూర్, సోనాల మండలం లోని సాకేర, కోట (కే), సోనాల టివిటి గ్రామాల పరిసరాలలో ఉన్న గుట్టలలో నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో తిప్పల ద్వారా మొరం తరలించకు పోతున్నారు. 

పట్టపగలు యదేచ్చగా ట్రాక్టర్ల లో తరలింపు.... 

బోథ్, సోనాల మండలాల్లో అక్రమ మొ రం తవ్వకాలు ప్రభుత్వ కార్యాలయాల ముందు నుండి పట్టపగలే మొరం ట్రాక్టర్లో తరలిస్తున్నారు. అడిగేవాడు లేకపోవడంతో మొరం మాఫియా పట్టపగలు గుట్టలను తవేసి మొరం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొంతకాలం పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కంటూ అధికారుల వద్ద నుండి అనుమతులు పొంది బయట వ్య క్తులకు విచ్చలవిడిగా విక్రయించు కున్నారు.. 

యదేచ్చగా వాల్టా చట్టం ఉల్లంఘన...

సహజ వనరులు అయినా మొరం గుట్టలను పట్టపగలు రాత్రిపూట తవ్వకాలు కొనసాగిస్తూ విచ్చల విడిగా ఇసుక మొరం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భవనాలకు సమీపంలోని వాగుల నుండి నల్ల ఇసుకను పునాదులకు అవసరమైన పునాది రాళ్లను తరలిస్తున్నారు. పోచ్చ ర సమీపంలో నిర్మిస్తున్న ఓ ప్రైవేటు భవనానికి గ్రామం సమీపంలోని వాగులో నుండి నల్ల ఇసుక పునాది రాళ్లను తరలించిపోయారు. అక్రమ దందా కొనసాగుతున్న అట వీ శాఖ రెవెన్యూ శాఖల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా 20 ఫీట్ల లోతులో...

వాస్తవానికి మైనింగ్ అధికారుల నిబంధనల ప్రకారం మూడు ఫీట్ల కన్నా ఎక్కువ లోతుగా తగిలితే అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే కొత్త కర త్వాడ మిషన్ భగీరథ ట్యాంక్ కుడివైపున ఉన్న రెవెన్యూ గుట్టను 15 నుండి 20 ఫీట్ల వరకు తవ్వి మొరం తరలించారు. ఇంత బహిరంగంగా జరుగుతున్న ఈ వ్యాపారంపై అధికారులు చూడనట్లు వ్యవహరిస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి..

రెవెన్యూ రికార్డుల్లో ఉన్న బట్టలు తమవి కావలి అటవీశాఖ వారు పే ర్కొంటుండగా రెవెన్యూ శాఖ వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ గుట్టలుగా పేర్కొంటున్న వాటి పైన ఉన్న చెట్లు అటవీ శాఖ వారివి అయితే గుట్టలేము రెవెన్యూ శాఖ వారిగుట్టపై చెట్లను కొడితే అటవీ శాఖ వారు కేసులు చేస్తుంటే మొరం తీసుకువెళ్తే తమకు సంబంధం లేదం టూ అటవీ శాఖ వారు చేతులెత్తేస్తున్నారు రెండు శాఖల సమన్వయ లోపం వల్ల కోట్లాది రూపాయల మొరం తరలిపోయింది .