16 March, 2026 | 5:22 AM

మరమగ్గాల పరిశ్రమ

16-03-2026 12:37 AM

ప్రభుత్వాలకు పాలసీ లేదు

పరిశ్రమ పట్ల పట్టింపు లేదు 

విద్యుత్ చార్జీల విషయంలో దేశంలోని మనమే నెంబర్ వన్ 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనేక కోణాలు

రాజన్న సిరిసిల్ల మార్చి 15 (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణం ఒకనాడు ఉపాధి కోసం ఎదురు చూస్తూ నిలబడ్డ తరం మనుషులు ఇప్పుడు సిరిసిల్లాలో కనిపించక పోవ చ్చు. అనేక పరిణామాలు పరిశ్రమలో వస్తు న్న మార్పులు , మార్కెటింగ్, తో పాటు అనే క రకాలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్న చందంగా ఉన్న విషయం తెలిసిందే. సుమారు ఐదు దశాబ్దాలు కాలంలో వస్త్ర పరిశ్రమలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా మార్పులు ,పరిణామాల జోలికి పోకుండా సంక్షిప్తంగా వస్త్ర పరిశ్రమలోని సమస్యలకు మూలమవుతున్న పరిస్థితులను ఒక్కో ‘కోణం’లో వరుస గా విశ్లేషించే ప్రయత్నం. 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉపాధి లేక కొనసాగుతున్న నేత కార్మికుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రధానంగా సాంకేతిక అంశాలతో పాటు మార్కెటింగ్ ఇతర సమస్యలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను నిత్యం వెంటాడుతున్నాయి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని లేకుండా ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలకు ఏ విషయంలోనూ సరైన పాలసీలు లేవనే విషయం పరిశ్రమలో పరిస్థితులను చూస్తే గమనించవచ్చు. 

విద్యుత్ పాలసీ ఎక్కడ..!

ప్రధానంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు చెప్పుకుంటున్న విద్యుత్ సబ్సిడీ విషయంలో అనుసరిస్తున్న విధానాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. సిరిసిల్లలో చిన్న తరహాలో ఉన్న మరమగ్గాలు కలిగి ఉన్న ఆసాముల వ్యవస్థ ఒకనాడు ప్రధానంగా ఉండేది. పరిశ్రమలు వీరు ప్రధాన భాగంగా ఉండేవారు. క్రమ క్రమంగా వచ్చిన మార్పుల ఫలితంగా చిన్న తరహా ఆసాములకు ఉపాధి భారంగా మారిపోవడంతో ఇతర వృత్తుల్లోకి మారిపోవడం ఉన్న వృత్తిని వదిలేసుకోవడమో మెజార్టీగా జరిగింది. దేశంలో వస్త్ర పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహ కాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. విద్యుత్ చార్జీల విషయంలో అనుసరిస్తున్న విధానంలో దేశంలోనే టాప్ తెలంగాణ. 

ప్రస్తుతం విద్యుత్ చార్జీల విషయంలో దేశంలోనే టాప్ వన్ గా తెలంగాణ రాష్ట్రం కొనసాగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో అత్యల్పంగా వస్త్ర పరిశ్రమలకు ఉపయోగించే విద్యుత్ విషయంలో తక్కువ ధరలో కర్ణాటక రాష్ట్రంలో విద్యుత్ ఒక యూనిట్ కు 1 రూపాయి 25 పైసలు కాగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు మూడు రేట్లు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ లో వస్త్ర పరిశ్రమకు ఉపయోగించే విద్యుత్తు విషయంలో ఒక యూనిట్ 8 రూపాయల వరకు కొనసాగుతుంది.

తమాషా ఏమిటంటే ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 50% విద్యుత్ సబ్సిడీ పరిశ్రమకు ఏ రకంగా ఉపయోగ పడుతుందన్నది ప్ర శ్నార్థకమే. రాష్ట్రాల వారిగా చూసినప్పుడు తమిళనాడు లో యూనిట్ కు మూడు రూ పాయలు, గుజరాత్ రాష్ట్రంలో యూనిట్ ఐదు రూపాయలు, హర్యానా రాష్ట్రంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూపాయికి ఒక యూనిట్.విద్యుత్ సబ్సిడీ కలుపుకొని అందిస్తుంది. తమిళనాడులో యూనిట్ కు మూడు రూపాయలు, కొన్ని యూనిట్లకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా వస్త్ర పరిశ్రమ విషయంలో ప్రత్యేక పాలసీలేవి లేకపోవడం దురదృష్టకమే.

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పరిశ్రమల కోణం నుంచి చూస్తూ రావడం గమనించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్ర ప్రదేశ్ లో చిన్న తరహా కుటీర పరిశ్రమ గుర్తించి సిరిసిల్ల మరమగ్గాల రంగాన్ని రెండవ కేటగిరి లో చేర్చి విద్యుత్ తారీఫ్ నిర్ధారించేది. 2001లో పరిశ్రమలోని సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 50 శాతం విద్యుత్ సబ్సిడీ ఇస్తూ వస్తోంది.వస్త ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది.

సహకార విద్యుత్ సంస్థ సెస్ ద్వారా వస్త్ర పరిశ్రమకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. 25 వేల మర మగ్గాల యూనిట్లు పనిచేస్తున్నట్లు సెస్ లెక్కలు చెబుతున్నాయి. 127 ఎస్ ఎస్ ఐ యూనిట్లు 119 ఇతరైనట్లు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం సెస్ కు చెల్లించవలసిన సబ్సిడీ బకాయి 101. 77 కోట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2019 వరకు పరిశ్రమకు అంది స్తున్న విద్యుత్ త్ టారిఫ్ విషయంలో పెద్దగా పెరుగుదల లేదు.

పరిణామ క్రమం లో కుటీర పరిశ్రమల నుంచి పరిశ్రమల కేటగిరికి మార్చడంతో పరిశ్రమకు విద్యుత్ భారంగా మారిన విషయం గమనించవచ్చు. అయితే గతంలో ప్రభుత్వాలకు వస్త్ర పరిశ్ర మ విషయంలో ప్రత్యేక పాలసీ లేకపోవడంతో తీరని నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ‘విద్యుత్ పాలసీ’ని రూపొందిస్తుందా..? అన్నది ఎదురు చూడాల్సిందే.