జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను శాశ్వతంగా మూసివేయాలి
లక్షలాదిమంది కదం తొక్కితేనే డంపింగ్ యార్డ్ మూసివేత సాధ్యం
జనసంద్రమైన యాప్రాల్ డీఎన్‌ఆర్ సభాస్థలి
పర్యావరణ వేత్త సైంటిస్ట్ డాక్టర్ బాబురావు
జవహర్‌నగర్, జూలై 26 (విజయక్రాంతి): ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను శాశ్వతంగా మూసివేయాలని లక్షలాదిమం ది కదం తొక్కితేనే డంపింగ్ యార్డ్ మూసి వేత సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త సైంటిస్ట్ డాక్టర్ బాబురావు పిలుపునిచ్చారు.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ యాప్రాల్ డిఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమా మహేష్ అధ్యక్షతన డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ఆదివారం అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ పర్యావరణ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు హాజరై మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నాలుగు మండలాల ప్రాంతాల ప్రజలకు ప్రమాదకరమైన రాంకీ డంపింగ్ యార్డ్ ఎత్తివేత సాధ్యం కాదని పూర్తిగా మూసివేయాలని నగర పరిధిలోని బయటి చెత్తను ఇకమీదట జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలించకూడదని ప్రముఖ పర్యావరణ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు పేర్కొన్నారు.
ప్రముఖ పర్యావరణ వేత్త సర్వత్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర్ నలుమూలల నుంచి తరలించే చెత్తను జవహర్ నగర్ ప్రాంతంలో నివసించే సామాన్య పేద మధ్యతరగతి ప్రజల తలలపై గుమ్మరించడం దుర్మార్గమన్నారు. ప్రజల జీవించే హక్కును కాలరాయడం భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగకరమని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి శాస్త్రవేత్తలు విద్యావేత్తలు హక్కులనేతల సూచనలను పరిగణలోకి తీసుకొని రాంకీ చెత్త డంపింగ్ యార్డ్ ను పూర్తిగా మూసివేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. డంపింగ్ యార్డ్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పెద్దలు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోసు, నరసింగరావు, రమ, బొల్లినేని ప్రకాష్, కాంగ్రెస్ నేతలు గజ్జలకాంతం, మేడ్చల్ జిల్లా పిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ మేకల కావ్య, జాతీయ నాయకురాలు సంధ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ నాయకురాలు విమలక్క, ఓయూ ప్రొఫెసర్ సి. కాసిం, టిఆర్‌ఎస్ జాగృతి గొంగల్ల రంజిత్ కుమార్, బుర్ర రాముగౌడ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, ఉపసర్పంచ్ నరసింహ, మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, కొండల ముదిరాజ్, ఆలూరు రాజశేఖర్, కల్లేపల్లి సదానంద్, అనురాధ, మల్లేష్, గొడుగు వేణు, మేక లలిత యాదవ్, బండకింది సింగరయ్య గౌడ్, బూడిద వెంకటేష్, రాజనర్సింహ, జాన్, వెంకటాచారి, తదితర కళాకారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.






