27 July, 2026 | 1:46 AM

ఓట్ల ‘సంగ్రామం’పై బీజేపీ కసరత్తు

27-07-2026 12:51 AM

బడంగ్‌పేట్, జూలై 26 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్, బడంగ్పేట్, నాదర్గుల్, మీర్పేట్, జిల్లెల్గూడ, ప్రశాంతి హిల్స్ డివిజన్ల అధ్యక్షులు, ఇన్చార్జులతో నియోజకవర్గ పరిశీలకులు యెలిమేటి అమరేందర్ రెడ్డి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.

ఆగస్ట్ 3 వరకు ‘ఓట్ల సంగ్రామం‘లో భాగంగా ప్రతి బూత్లో ఇంటి పెద్ద ఫోన్ నంబర్లు, బదిలీ అయిన, చనిపోయిన ఓటర్ల వివరాలను బి ఎల్ వో లు ల ద్వారా సేకరించాలని సూచించారు. కొత్తగా ఆన్లైన్ అయిన ఓట్ల వివరాలను సరిచూసుకుంటూ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బి.గోవర్ధన్ రెడ్డి, సిద్దాల శ్రీశైలం, బంగారి అశోక్, నాయకులు ప్రశాంత్ రెడ్డి, జ్ఞానేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.