13 July, 2026 | 2:27 AM

ఆర్‌సీపురంలో మాంగళ్య షాపింగ్ మాల్

13-07-2026 01:53 AM

31వ శాఖను ప్రారంభించిన సినీ నటి రాశీఖన్నా  

హైదరాబాద్, జూలై 12(విజయక్రాంతి): 2012లో తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్ర జల ఆదరణను పొందిన మాంగళ్య, ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తన ఉనికిని చాటింది.

ఈ క్రమంలో ఆర్ సీ పురంలో 31వ శాఖను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి రాశి ఖన్న ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌లోని వి విధ విభాగాలను సందర్శించి, అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా నటి రాశి ఖన్నా మాట్లాడుతూ ఆర్‌సీ పురం ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్‌కు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉంది.

వారి ఆశీర్వాదాలతో ఈ మాల్ మరింత విజయవంతమవుతుంది అని అ న్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినా థ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే మా విజయ రహస్యం అని తెలిపారు. ‘మా స్వం త హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఆధునిక మా ర్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్ చేసి, వస్త్ర వ్యాపారంలో ముందంజలో కొనసాగుతున్నాం’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మాంగళ్య షాపింగ్ మాల్, రాబోయే రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 10 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనుండగా, భవిష్యత్తులో తమిళనాడు రాష్ట్రానికి కూడా విస్తరిం చనున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన మాంగళ్య షాపింగ్ మాల్, పాన్ ఇండియా స్థాయిలో నంబర్ వన్ షాపింగ్ మాల్‌గా నిలుస్తోంది. ఆర్‌సీ పురం ప్రజలు తమ తమ శుభ కార్యక్రమం ఏది ఉన్న ఒకసారి మాంగ ళ్య షాపింగ్ మాల్‌కు సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఒక నూతన షాపింగ్ ఒరవడి సృష్టించాలని డైరెక్టర్స్ కోరారు. ఈ మాల్ ప్రారంభంతో ఆర్‌సీ పురం ప్రజలు ఇకపై పెళ్లి షాపింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఇక్కడే నాణ్యమైన వస్త్రాలను కొనుగోలు చేయవచ్చన్నారు.