టీఆర్పీలో భారీగా చేరికలు
13-07-2026 01:53 AM
హైదరాబాద్, జూలై 12(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జిగా నియమితులైన గట్ల రాజన్నకు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బాధ్యతలు అప్పగించారు.
అలాగే హైదరాబాద్‌కు చెందిన మోహన్‌రావు, ఎం ప్రశాంత్, డి.కుమార్ టీఆర్పీలో చేరగా వారికి మల్లన్న పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజని కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శు జ్యోతి పండేల్ ,రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు బత్తిని మీనా గౌడ్, పార్టీ నాయకులు సంపత్ పటేల్, భద్రకాళి రమణ తదితరులు పాల్గొన్నారు.






