31 August, 2026 | 1:08 PM

మండల స్థాయి టోర్నమెంట్

31-08-2026 12:20 PM

సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు

కోహెడ, ఆగస్టు 31(విజయక్రాంతి): పాఠశాల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు మండల స్థాయి టోర్నమెంట్, ఎంపిక నిర్వహిచనున్నట్లు ఏంఈఓ పద్మయ్య తెలిపారు. స్థానిక తెలంగాణా రెసిడెన్షియల్ స్కూల్ లో క్రీడలను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడాలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా స్థాయి కి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.