31 August, 2026 | 2:43 PM

కోట గుళ్ళలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకుల పూజలు

31-08-2026 02:01 PM

గణపురం,ఆగస్టు 31 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శ్రావణమాసం సోమవారం పర్వదినం సందర్భంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో వారిని ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ పూజా కార్యక్రమాల్లో క తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధానకార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ తెలంగాణ మెపా పౌండర్ పులి దేవేందర్ ముదిరాజ్ భూపాలపల్లి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు జోరుక సదయ్య ముదిరాజ్ ములుగు జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు ఏర్ల వెంకన్న ముదిరాజ్ మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరటి రాజు ముదిరాజ్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు చాడ కృష్ణస్వమి ముదిరాజ్ మండల అధ్యక్షులు బోయిని సాంబయ్య ముదిరాజ్ ఆకుల సుభాష్ ముదిరాజ్ లు పాల్గొన్నారు