మోడల్ స్కూల్ లో ప్రారంభమైన ఆల్ఫాహారం
31-08-2026 12:24 PM
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) కార్యక్రమం సోమ వారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో గల పీఎం శ్రీ మోడల్ హైస్కూల్ లో ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న ప్రారంభించారు. మొదటి రోజు ఇడ్లీ, సాంబార్ సాంబార్ తో విద్యార్థులకు అల్పాహారం అందజేశారు.
నాణ్యతతో కూడిన టిఫిన్ అందించడంతో విద్యార్థులు ఇష్టంగా తిన్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది విద్యార్థులకు టిఫిన్ వడ్డించిన అనంతరం వారు కూడా తిన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.







