31 August, 2026 | 2:03 PM

సమస్యలు పరిష్కరించాలని కమీషనర్ కి వినతి

31-08-2026 01:14 PM

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటి పరిధిలోని 10వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వార్డు కౌన్సిలర్ గర్రెపల్లి శాంతారాణి సోమ వారం మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ వార్డు పరిధిలోని రాజీవ్ రోడ్, మెయిన్ రోడ్డు లోని సిమెంట్ రోడ్డు పగుళ్ళు తేలి వాహనదారులు కింద పడి  గాయాల పాలవుతున్నారన్నారు. ఈ రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మతులు చేయించి తర్వాత నూతన రోడ్డును ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే ఈ వార్డు పరిధిలో గల పేద ముస్లిం సోదరులకు తాగునీటి ఎద్దడి ఉందనీ, కావున వాటర్ ట్యాంక్ ఏరియాలో ఉన్న హ్యాండ్ బోర్ స్థానంలో నూతన మోటార్ బిగించి కాలనీ వాసుల కష్టాలు తీర్చాలని కోరారు.