31 August, 2026 | 2:04 PM

కోటగుళ్లలో సర్పంచ్ రాధిక, శ్రీనివాస్ దంపతుల పూజలు

31-08-2026 12:58 PM

గణపురం ఆగస్టు 31 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శ్రావణమాసం సోమవారం పర్వదినం సందర్భంగా గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు స్వామి వారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.