31 August, 2026 | 2:04 PM

మాల సంఘంలో తాగునీటి సమస్యకు పరిష్కారం.. నూతన మోటార్ ఏర్పాటు

31-08-2026 12:56 PM

కోనరావుపేట ఆగష్టు 31 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో మాల సంఘం వద్ద నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు బోయిని దేవరాజు ఆధ్వర్యంలో నూతన మోటార్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా స్థానికుల తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకొని మోటార్‌ను బిగించినట్లు తెలిపారు.గ్రామ ప్రజలకు నిరంతరాయంగా మంచినీరు అందేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బీరయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు