25 July, 2026 | 3:08 AM

చారిత్రక రావిచెట్టును రక్షించాలి

25-07-2026 02:27 AM

అలంపూర్, జూలై 24 :  రాజోలి మండ లం పెద్దతాండ్రపాడులో సుమారు 70 ఏళ్ల చరిత్ర కలిగిన రావిచెట్టును పరిరక్షించి, దాని చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి రచ్చకట్టను పునర్నిర్మించాలని గ్రామ సభలో గ్రామస్తులు అధికారులను కోరారు. సర్పంచ్ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన స మావేశంలో వినతిపత్రం అందజేస్తూ, రావిచెట్టు గ్రామ వారసత్వానికి ప్రతీకగా నిలిచిం దని, దానిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు.