06-02-2026 01:48:34 AM
హర్వర్డ్ వర్సిటీ ప్రెసిడెంట్, డీన్‌లకు మెయిల్ ద్వారా బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్పీ విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ అందజేసిన సర్టిఫికెట్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలాన్ గార్బర్, డీన్ విన్ స్టీన్‌లకు గురువారం ఒక ఈమెయిల్ పంపించారు. దేశంలో ఏ సీఎం ఎదుర్కోనన్ని (89) క్రిమినల్‌కేసులు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారని, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ ప్రకారం ఇందులో 72 సీరియస్ ఐపీసీ కేసులు ఉన్నాయని వివరించారు.