14 May, 2026 | 4:21 AM

పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

14-05-2026 02:59 AM

నాగిరెడ్డిపేట్, మే 13 (విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి, వాడి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమం ఆనందోత్సహాల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, పాల్గొని గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ... కూలి పనుల నిమిత్తం హైదరాబాదులో పని చేసుకుంటూ జీవనం సాగించేవారని,సొంతిల్లు లేదా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవారి కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం వారి జీవితంలో కొత్త ఆశలను నింపిందని లబ్ధిదారులు తెలిపారు.

మాకు సొంతింటి కలను నిజం చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటామని, ఇప్పుడు మా స్వగ్రామంలోనే ఉండి పని చేసుకుంటూ ఆనందంగా జీవించగలుగుతున్నామన్నారు.అనంతరం గ్రామస్తులంతా జై కాంగ్రెస్ జై మదన్ అన్న అనే నిదానాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,నాయకులు వాసురెడ్డి, ఈమామ్, శ్రీరామ్ గౌడ్, కిరణ్, సంజీవరావు, పర్వత్ రావు, తదితరులు పాల్గొన్నారు.