9 May, 2026 | 6:16 AM

బాధిత కుటుంబానికి అండగా ప్రభుత్వం

09-05-2026 12:00 AM

మాజీ ఏమ్మెల్సీ రాములునాయక్

కంగ్టి, మే 8 : మూడు రోజులక్రితం బట్టలు ఉతకడానికి వెళ్లి కాలు జారి బావిలో పడి మృతి చెందిన బాలికల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ రాములు నాయక్ అన్నారు.

శుక్రవారం ఆయన విజయక్రాంతితో మాట్లాడుతూ ప్రమాదావశత్తు  చనిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక జైన్ ను కోరడం జరిగిందని అన్నారు. ఈవిషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత ట్రైబర్ వెల్ఫేర్ అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకునేలా కృషి చేస్తానని అన్నారు. మృతి చెందిన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.