10 July, 2026 | 3:48 PM

అమనగల్‌లో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం

10-07-2026 03:01 PM

* విద్యార్థులతో ప్రతిజ్ఞ

​అమనగల్,(విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అమనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం శుక్రవారం  నిర్వహించారు. అమనగల్ ఎస్‌హెచ్‌ఓ ఎస్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.​ ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యం, కుటుంబాలు ఎలా నాశనమవుతాయో వివరించారు.

ఎన్‌డీపీఎస్ చట్టం–1985 ప్రకారం డ్రగ్స్ వాడినా, విక్రయించినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు వీటికి దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.​అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, యాంటీ డ్రగ్స్ హెల్ప్‌లైన్ (1908) వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు  సిబ్బంది పాల్గొన్నారు.