9 May, 2026 | 7:04 AM

మెగా జాబ్‌మేళా విజయవంతం

09-05-2026 12:00 AM

సంగారెడ్డి, మే 8 (విజయక్రాంతి): ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మెగా జాబ్ మేళాను శుక్రవారం సంగారెడ్డి జిల్లా తార డిగ్రీ కళాశాలలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రైవేట్ రంగ సంస్థలతో అనుసంధానం చేయడం లక్ష్యంగా నిర్వహించిన ఈ జాబ్ మేళాకు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల నుంచి సుమారు 1500 మంది యువతీ యువకులు హాజరయ్యారని తెలిపారు.

ఈ జాబ్ మేళాలో ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్ తదితర రంగాలకు చెందిన సుమారు 60 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధిత కంపెనీలు యువజన, క్రీడల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు తెలిపారు.