9 May, 2026 | 5:25 AM

పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థికాభివృద్ధి

09-05-2026 12:00 AM

నర్సాపూర్, మే 8 (విజయ క్రాంతి) : పశువుల ఆరోగ్యమే రైతుల ఆర్థికాభివృద్ధికి బలం అని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. శుక్రవారం 99 రోజుల ప్రజాపాలన  ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని నర్సాపూర్ మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో పశు చికిత్స మరియు అవగాహన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, ఈ శిబిరాన్ని ప్రారంభించి, దూడలు, గొర్రెలు, మేకలకు నులిపురుగుల నివారణ మందులు వేయించారు.

అనంతరం ఖనిజ మిశ్రమాన్ని రైతులకు పంపిణీ చేశారు. ఈ  శిబిరం ద్వారా పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించారు. ఇందులో భాగంగా పశువులకు  వైద్య సేవలు అందించగా,  రైతులు పాల్గొని ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం..

చేగుంట, మే 8: తెలంగాణ ప్రభుత్వ ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక‘ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘సమగ్ర పశుసంవర్ధక చికిత్స, అవగాహన శిబిరం నిర్వహించారు.

ఈ వేడుకలో చేగుంట గ్రామ ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ ముఖ్య అతిథిగా పాల్గొని పశువులకు అవసరమైన మందులు పంపిణీ చేయడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దూడల ప్రదర్శనను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ అసిస్టెంట్ ఏ. రాజు, గోపాలమిత్రలు ప్రశాంత్, రాజమణి, రైతులు రఘుపతి, నాగరాజు, మల్లేశం, రాములు,పాల్గొన్నారు.

పాడి పశువుల పెంపకంతో ఆర్ధికాభివృద్ధి

కోహెడ, మే 8: పాడి పశువుల పెంపకం తో రైతులు ఆర్ధికాభివృద్ధి త్వరగా సాదించవచ్చని.. తీగలకుంటపల్లి సర్పంచ్ మ్యాకల స్వర్ణలత సురేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా  సోమరంపల్లి గ్రామం లో పశువైద్య ఆరోగ్య, పశు సంపద సంతానోత్పత్తి మెగా శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయం ఉన్న రైతులు తప్పనిసరిగా పాడి గేదె, ఆవులను పెంచుకోవాలని సూచించారు. పాడి పశువులతో వచ్చిన ఆదాయంతో ఇంటిలోని చిన్న చిన్న ఆర్థిక అవసరాలు తిరుతయాన్నారు. అనంతరం రైతులకు సబ్సిడీ గడ్డి విత్తనాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చల్ల శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ రాగుల మహేష్ వార్డు మెంబర్స్, రైతులు, హరీష్ అశోక్ సుదీర్, రాజు, తిరుపతి బిక్షపతి, రమేష్, సంపత్  పాల్గొన్నారు.