మండల కార్యాలయాల కోసం స్థల పరిశీలన
బోథ్,(విజయక్రాంతి): ప్రభుత్వ పరంగా సోనాల మండల కేంద్రంలో ఇటీవల మంజూరి అయిన ఎంపీడీవో తాసిల్దార్ కార్యాలయ నిర్మాణానికి శుక్రవారం మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో నాయకులు స్థలాన్ని పరిశీలించారు. తాసిల్దార్ మల్లేష్ తో పాటు ఎంపీడీవో రత్నాకర్ రావు లు పాల్గొని అవసరమైన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అంతేగాక శిథిలావస్థలో ఉన్న పశువైద్యశాలని నూతన కార్యాలయాలను నిర్మించుటకై నాయకులు చర్చించారు.
అంతేగాక పశువైద్యశాలను నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు కలెక్టర్కు సిఫారసు చేయాలని కోరడంతో తాసిల్దార్ అందుకు అంగీకరించి ప్రతిపాదనలను పంపిస్తామన్నారు. అంతేగాక రానున్న రోజుల్లో పోలీస్ స్టేషన్ విద్యాసంస్థల స్థలాన్ని గ్రామస్తులు అందరి సమక్షంలో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించడం జరిగింది. అట్టి భూమి సర్వే చేసి నూతన భవనాల నిర్మాణానికి సహకరించాలని నాయకులు అధికారులను కోరారు.






