ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేవిధంగా బీఎల్వో చూడాలి
మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మ బేగం ఎజాజ్
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 18వ వార్డు పాత అంగడి బజార్ ఇస్లాంపుర కాలనీలోని ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యే విధంగా బిఎల్వోలు చూడాలని బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మ బేగం ఎజాజ్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున స్పెషల్ ఇంటెన్సివ్ ఎన్యూమ్యురేషన్ డోర్ టు డోర్ కార్యక్రమం లో భాగంగా శుక్రవారం వైస్ చైర్మన్ రేష్మ బేగం ఎజాజ్ ఓటర్ నమోదు పత్రాలను అందజేశారు. ఓటర్ నమోదు పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాలనీలోని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్వయంగా ఓటర్ నమోదు పత్రాలను వారు స్వయంగా నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని, కాలనీ వాసులు సహకరించాలని వారు కోరారు. ప్రజలకు ఎన్యుమరేషన్ ఫారంలో పూర్తిగా బి ఎల్ వో లు నమోదు చేయాలని సూచించారు.ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు.






