దేశాయిపేటలో ఎస్ఐఆర్ ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం
10-07-2026 03:03 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో శుక్రవారం నాడు ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటు సవరణ నమోదు ఎన్యుమరేషన్ ఫామ్ స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు వారి యొక్క ఓటు సవరణ కార్యక్రమంలో పాల్గొని వారి ఓటు హక్కుని కాపాడుకోవాలని సూచించడం జరిగింది. ఓటర్ల నుండి జాబితా ను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిపిఓ సాయిలు బూత్ ఏజెంట్ ప్రశాంత్ కుమార్ గ్రామపంచాయతీ సిబ్బంది మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.






